ATP: రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. నగరంలోని అలెగ్జాండర్ హోటల్‌లో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ పథకాల అమలు, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు చేరుకున్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి


