హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో గొడవలకు తావివ్వకూడదు: డీఎస్పీ

VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విజయనగరం డీఎస్సీ లక్ష్మణరావు శుక్రవారం కొత్తవలస గ్రామం రామాలయం వద్ద గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి వాటిపేరుతో గ్రామంలో తగాదాలు పడకూడదని సూచించారు. ఎన్నికల పేరుతో గొడవలకు దిగితే జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ విజయకుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.