SRCL: ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల స్థాయి సమావేశంలో ఈ నెల 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివాస్‌కు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పాల్గొన్నారు.
తెలంగాణ
'దీక్షా దివాస్ విజయవంతం చేయాలి'


