హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపల్లి బొమ్మల పునరుజ్జీవనానికి రూ.20 లక్షల ప్రాజెక్టు

NTR: నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొండపల్లి బొమ్మల కళకు ప్రోత్సాహం అందించేందుకు రూ.20 లక్షల ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఏడాది పాటు అమలయ్యే ఈ ప్రాజెక్టుతో 420 మంది కళాకారులకు ప్రయోజనం చేకూరనుంది. నైపుణ్య శిక్షణ, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయన్నారు.