హైదరాబాద్: 28°C
తెలంగాణ

 క్షుద్రపూజల పట్ల ప్రజలు భయపడొద్దు: సీఐ

BHPL: కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలో వరుసగా చోటుచేసుకుంటున్న క్షుద్రపూజల ఘటనలతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ భీమేష్, ఎస్సై శ్రీనివాస్ గ్రామస్థులతో సమావేశమై మాట్లాడారు. ఇలాంటి ఘటనల పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు.