హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ తగాదా.. వ్యక్తి దారుణ హత్య..!

VZM: గంట్యాడ మండలం లక్కిడాం గ్రామ పరిధిలో శుక్రవారం భూ వివాదం నేపథ్యంలో గొల్లు సత్తిబాబు(58) దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ భూమిలో పనులు చేసుకుంటున్న సమయంలో కిలపర్తి రామకృష్ణ, అతని భార్య గౌరీదేవి దాడి చేయడంతో సత్తిబాబు కుప్పకూలి మృతిచెందినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.