హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన నూతన జడ్పీ ఉప ఛైర్మన్‌

నంద్యాల జిల్లా జడ్పీ ఉప ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఆయన మర్యాదపూర్వకంగా కలవగా అభినందించారు. జిల్లా ప్రగతిలో శ్రీకాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంతా కలిసికట్టుగా పనిచేద్దామని అఖిల ప్రియ ఆకాంక్షించారు.