హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అచ్చంపేటలో కళాశాలలు ఏర్పాటు చేయాలి'

NGKL: అచ్చంపేటలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని MSF ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మహేశ్ డిమాండ్ చేశారు. నల్లమల ప్రాంతాన్ని విద్యా హబ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. ఈనెల 26న మద్దిమడుగు పర్యటనకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి తమ డిమాండ్లపై స్పందించాలన్నారు. లేకుంటే పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.