హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత నామినేషన్లకు పటిష్ట బందోబస్తు

PPM: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల ప్రక్రియఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి తెలిపారు. మూడవ విడత నామినేషన్ల ప్రక్రియను కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 3వ విడతలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో నామినేషన్లు ప్రారంభం అవుతాయి.