BDK: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలతో పాటు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే కొత్తగూడెంలోని రామవరం మాతా శిశు ఆసుపత్రిలో బాలింతలకు అందిస్తున్న భోజనంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. నాణ్యమైన ఆహారం అందించాల్సిన చోట నాసిరకం భోజనం పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ
బాలింతలకు ఇదేం భోజనం.. పట్టించుకునే వారేరీ?


