NZB: సిరికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం శిబిరాన్ని ఎంఎస్ఓ ప్రకాష్ సందర్శించి పరిశీలించారు. పథకం అమలు షెడ్యూల్, సిబ్బందికి కేటాయించిన విధులు, బాధ్యతలను తెలుసుకున్నారు. లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించి, వారితో మాట్లాడి పథకానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై పరిశీలన


