హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన

JGL: రాయికల్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ రాఘవులు, ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు పొన్నం రమేష్ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై ప్రభావాలను వివరించారు. వాటికి దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.