హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడతలో నామినేషన్ల వెల్లువ..!

ELR: కుకునూరు మండలంలోని మూడో విడతలో 15 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 55 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకగ్రీవాల కోసం టీడీపీ, వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. అయితే కుకునూరు సర్పంచ్ పదవికి ఇద్దరు స్వతంత్రులు నామినేషన్ వేయడంతో ఏకగ్రీవానికి చిక్కు ఏర్పడింది. వారు ఉపసంహరించుకుంటారా లేదా అన్నది నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాతే తేలనుంది.