పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డుకు చెందిన రాందేని స్వప్న అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో నేత్రదానానికి అంగీకరించారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు శుక్రవారం ఆమె కార్నియాలను సేకరించి సికింద్రాబాద్ ఐ బ్యాంకుకు తరలించారు. ఇద్దరికి చూపునిచ్చేలా చేసిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.
తెలంగాణ
మరణంలోనూ ఇద్దరికీ నేత్రదానం


