హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల పర్వానికి అంతా సిద్ధం

AKP: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాతవరం మండలంలోని 31 పంచాయతీలకు సంబంధించి 10 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ప్రారంభంకానున్న ప్రక్రియ కోసం ఆయా కేంద్రాలకు అవసరమైన ఎన్నికల సామగ్రిని తరలించి సిద్ధంగా ఉంచారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.