హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో 'రన్ ఫర్ అంబేద్కర్'

VSP: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్‌లో ఆదివారం 'రన్ ఫర్ అంబేద్కర్' నిర్వహిస్తున్నట్లు భీమ్ సేన వైజాగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ తెలిపారు. కాళీమాత విగ్రహం నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ సాగుతుందన్నారు. 1949 నవంబర్ 26న అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించిన రోజును స్మరించుకుందామన్నారు.