భారత్, పాక్ మధ్య జరగాల్సిన 'ఆసియాకప్ ఫర్ ది బ్లైండ్' క్రికెట్ టోర్నీ ఫైనల్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గ్రూప్ దశలో మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పాక్‌కు ట్రోఫీని అందించాలని నిర్ణయించారు. దీనిని భారత జట్టు వ్యతిరేకించి బహుమతి ప్రదానోత్సవం నుంచి వాకౌట్ చేసింది. నిబంధనలను ఉల్లంఘించారని, ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిందేనని భారత ప్లేయర్లు కోరారు. ఫైనల్‌కు 'రిజర్వ్ డే' ఉండాలని చెబుతున్నారు.
క్రీడలు
పాక్‌కు ట్రోఫీ.. రూల్ సరికాదంటూ భారత్ వాకౌట్


