హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఆర్‌డీఓ పీడీగా నర్సింగరావు బాధ్యతలు..

VKB: జిల్లాలోని డీఆర్‌డీఓ పీడీగా బి. నర్సింగరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని నర్సింగరావు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.