హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన 2వ విడత నామినేషన్ ప్రక్రియ

PLD: సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 281, వార్డులకు 1,390 నామినేషన్లు వచ్చాయి. మూడు రోజుల్లో మొత్తం సర్పంచ్ స్థానాలకు 684, వార్డులకు 2,860 నామినేషన్లు దాఖలయ్యాయి. డివిజన్‌లోని 9 మండలాల పరిధిలో 150 గ్రామపంచాయతీలు, 1,562 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.