హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో దశ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

ATP: జిల్లాలో మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో SP జగదీష్ ఆదేశాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో 172 పంచాయతీలు, 1,784 పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా ఉంచారు. ఈ నెల 21-23 వరకు నామినేషన్లు, డిసెంబరు 2న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.