ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె జడ్పీ హైస్కూల్లో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు. బాలలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు


