హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నూతన బస్ సర్వీసు ప్రారంభం

NGKL: లింగాల మండలం అంబటిపల్లి గ్రామ ప్రజల రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. లింగాల నుంచి పెద్దకొత్తపల్లికి అంబటిపల్లి మీదుగా నడిచే నూతన బస్ సర్వీసును సర్పంచ్ జంబుల శ్రీవాణి ప్రారంభించారు. గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ హనుమంత్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.