ఎన్టీఆర్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏ.కొండూరు మండలం సమస్యాత్మక గ్రామాలైన చీమలపాడు, కంభంపాడులో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలకు భరోసా కల్పించారు. ఓటర్లు భయం, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల్లో గొడవలు, బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


