SRCL: ఇల్లంతకుంట మండలం రామోజీపేట ఎంపీయూపీఎస్ పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయ వృత్తిలోని బాధ్యతలు, ఓర్పు, సహనం, క్రమశిక్షణను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సుధాకర్ శర్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
రామోజీపేటలో స్వయం పరిపాలన దినోత్సవం


