హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్

MLG: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి నేడు ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ తెలిపారు. NI Act కింద నమోదైన కేసుల కక్షిదారులు, ఫిర్యాదుదారులు, ప్రతివాదులు హాజరై పరస్పర అంగీకారంతో రాజీ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు.