హైదరాబాద్: 28°C
తెలంగాణ

డయాబెటిస్ పై అవగాహన సదస్సు

PDPL పెద్దపల్లి లయన్స్ క్లబ్ రంగనాయక, డిస్ట్రిక్ట్ 320జీ ఆధ్వర్యంలో డయాబెటిస్ అవగాహన మాసంలో భాగంగా శుక్రవారం బంధంపల్లిలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 73 మందికి షుగర్ పరీక్షలు చేసి, మధుమేహం, బీపీపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ వ్యాధులపై అవగాహన అవసరమని క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. లింగాల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.