BPT: బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో 10వ తరగతి చదవుతున్న పాఠశాల విద్యార్థులకు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో గంజాయి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించమని ప్రోత్సహిస్తే భయపడకుండా ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన


