హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారికి వెండి తిరుమంజన పాత్ర బహూకరణ

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.5 లక్షల విలువైన 2.5 కిలోల వెండి తిరుమంజన పాత్రను ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ శుక్రవారం బహూకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని ఏఈవో దేవరాజులుకు పాత్రను అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.