హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చట్టాలు తెలుసుకుంటేనే బాల్యం సురక్షితం'

NRPT: చట్టాలపై అవగాహనతోనే బాలల హక్కులను కాపాడగలమని లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్ అన్నారు. పట్టణ పీహెచ్‌సీ పాఠశాలలో నిర్వహించిన సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమంలో బాల్య వివాహాలు, బాల కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు వివాహం, 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయించడం నేరమని తెలిపారు. సమస్యలుంటే 1098, 100, 15100కు ఫోన్ చేయాలన్నారు.