పెద్దపల్లి ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈనెల 21న మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. 20కి పైగా ప్రముఖ కంపెనీలు, 2 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి తెలిపారు. అర్హత కలిగిన యువత బయోడేటా, సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 21న జాబ్ మేళా


