హైదరాబాద్: 28°C
తెలంగాణ

బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలి: కమిషనర్

MBNR: జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గిరీష్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. భువన్ సర్వే పనులను గడువులోగా పూర్తి చేయాలని, ఆస్తి పన్నుల బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వార్డుల్లో ప్రచారం నిర్వహించాలని, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.