ASR: అరకువేలి మండలంలో పంచాయతీ ఎన్నికల అభ్యర్థులు ఈనెల 21 నుంచి 23వ తేదీలోగా నామినేషన్లు పూర్తి చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శుక్రవారం సూచించారు. చినలబుడు, చొంపి, గన్నెల, లోతేరు, మాడగడ, పద్మాపురం, పెదలబుడు, సుంకరమెట్ట గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. గడువు తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఆలస్యం చేయవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
'23లోగా నామినేషన్లు పూర్తి చేయండి'


