హైదరాబాద్: 28°C
వార్తలు

గగన్‌యాన్ మిషన్ వాయిదా..!  

ఇస్రో చేపట్టనున్న ప్రతిష్టాత్మక 'గగన్‌యాన్ మిషన్' వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మిషన్‌లో భాగంగా చేపట్టాల్సిన మొదటి మానవరహిత ప్రయోగం 2026 డిసెంబర్‌లో జరగాల్సి ఉండగా.. 2027 ఫిబ్రవరి కంటే ముందు ఉండకపోచ్చంటూ జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని, వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఇస్రో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.