యూపీలో 454 చెట్లను నరికివేసిన వ్యాపారి శంకర్ అగర్వాల్‌కు సుప్రీంకోర్టు మరో రూ.50 లక్షల జరిమానా విధించింది. ఇప్పటికే రూ.4.54 కోట్ల జరిమానా చెల్లించడంతో పాటు, రూ.2 కోట్లతో 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అటవీ అభివృద్ధికి ప్రభుత్వానికి అప్పగించారు. అలాగే, నెల రోజుల జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కేసు ముగింపులో భాగంగా అతడికి మరో రూ.50 లక్షల జరిమానా విధించింది.
వార్తలు
చెట్లు నరికివేత… వ్యాపారికి రూ.5 కోట్ల జరిమానా


