హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు బోధన్‌లో విద్యుత్ అంతరాయం

నిజామాబాద్: బోధన్ పట్టణంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. 33/11 KV సబ్‌స్టషన్ పరిధిలో 3వ శనివారం నిర్వహించే నిర్వహణ పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణంలోని అన్ని కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.