జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుల్లో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ CH. రాజశేఖర్ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పిస్తామన్నారు. అర్హులు తమ వార్డులకు కేటాయించిన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
రేపు ఇందిరమ్మ బీమా నమోదు


