హైదరాబాద్: 28°C
వార్తలు

'రఫేల్' అదృశ్యం ఆరోపణలు.. ఖండించిన మాజీ అధికారి

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్‌కు చెందిన 4 రఫేల్ యుద్ధ విమానాలు అదృశ్యమయ్యాయంటూ బ్రిటిష్ మ్యాగజైన్ 'ఫ్లైట్‌గ్లోబల్' ప్రచురించింది. భారత్ వద్ద రఫేల్ యుద్ధ విమానాల సంఖ్యను 32గా పేర్కొంది. దీనిని ఐఏఎఫ్ మాజీ వైస్ చీఫ్ నర్మదేశ్వర్ తివారీ ఖండించారు. ఆ గణాంకాలు అవాస్తవమని, భారత్ ఎలాంటి రఫేల్ విమానాన్ని కోల్పోలేదని స్పష్టం చేశారు. గతంలోనూ ఆ మ్యాగజైన్ తప్పుడు సమాచారం ఇచ్చిందని తెలిపారు.