హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరా కుటుంబ జీవిత బీమా నమోదు రేపటి నుంచి ప్రారంభం

వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి, వనపర్తి 5వ వార్డులో ఐదుగురికి దరఖాస్తులు నమోదు చేయించారు. 18–59 ఏళ్ల అర్హులు గ్రామాలు, వార్డుల్లో ఏర్పాటు చేసే శిబిరాల్లో రేషన్ కార్డు వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.