హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జడ్పీటీసీలు గైర్హాజరు

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పుత్తా నరసింహారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ తరఫున గెలిచిన ముగ్గురు జడ్పీటీసీలు హాజరుకాలేదు. జడ్పీ ఛైర్మన్ పదవిని ఆశించిన జమ్మలమడుగు సభ్యుడు చిదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డి కుర్చీ ఖాళీగా మిగిలింది. చివరి నిమిషంలో పుత్తా ఎంపిక కావడంతో బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు.