హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ: ధర్మా నాయక్

MLG: సమగ్రశిక్ష పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు త్వరలో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అందించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి డాక్టర్ ధర్మా నాయక్ తెలిపారు. ఈమేరకు కరాటే కోచ్‌లతో సమావేశమై శిక్షణ ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాలోని కోచ్‌లు, అసోసియేషన్ సభ్యులు DYSO కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. శిక్షణతో బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు.