హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో 10,404 మంది ఓటర్లు గుర్తింపు

ELR: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 10,404 మంది ఓటర్లను గుర్తించినట్లు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, తహసీల్దార్ ఎం. సన్యాసి రావు తెలిపారు. గైర్హాజరు, బదిలీ, మరణించిన, డూప్లికేట్ ఓటర్లు ఈ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. మండలాల వారీగా ఉంగుటూరు 2661, భీమడోలు 2805, నిడమర్రు 1447, గణపవరం 3491 మంది ఉన్నారని తెలిపారు.