MBNR: జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ పరిధిలో నిర్వహించిన పవిత్ర గ్యార్మీ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. నూర్ సాబ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. మతసామరస్యం, సోదరభావం, ఐక్యతకు ఇలాంటి వేడుకలు ప్రతీకలని అన్నారు. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, సౌభ్రాతృత్వం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న మిథున్ రెడ్డి


