VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ శిథిలాస్థితికి చేరడంతో కొత్త భవనానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాత భవనాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. వర్షాకాలంలో పాత భవనంలో సిబ్బంది నానా అగచాట్లు పడుతుండడంతో సీఐ ప్రత్యేక చొరవతీసుకుని ఎస్పీ దామోదర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కొత్త భవనానికి ప్రణాళికలు తయారు చేయాలని సీఐకి ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్ భవనం కూల్చివేత


