హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎగ్ డొనేషన్ కేసులో హైకోర్టు కీలక ప్రశ్న

HYD: నగరంలో చర్చనీయాంశంగా మారిన ఎగ్ డొనేషన్ కేసులో పలువురు ఐవీఎఫ్ వైద్యుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎగ్ సేకరణ ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని కేంద్రాల నిర్వాహకులు కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మహిళలకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవ్వడం దోపిడీ కాదా? అంటూ ప్రశ్నించింది. కేసుపై విచారణ కొనసాగుతోంది.