హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సంఘ భవనం, జీవనోపాధి కేంద్రం ప్రారంభం

VKB: పరిగి మండలం పోల్కంపల్లిలో రూ.35 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఇందులో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో మహిళా సంఘం భవనం, మరో రూ.10 లక్షలతో మహిళా శక్తి జీవనోపాధి కేంద్రం నిర్మించారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.