హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించాలి'

BDK: టేకులపల్లి మండలం తడకలపూడిలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై న్యాయ అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చిన్నారుల భవిష్యత్తు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. పాఠశాల మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి విద్యలో చేర్పించాలని సూచించారు.