VSP: బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలకు శుక్రవారం రాటముహూర్తంతో శ్రీకారం చుట్టారు. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా వేదమంత్రాలు, నాదస్వరాల మధ్య శాస్త్రోక్తంగా రాట వేశారు. అనంతరం ముత్తైదువులకు తాంబూలాలు అందజేశారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఈవో కె. శోభారాణి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మార్గశిర మాసోత్సవాలకు రాటముహూర్తం


