హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్-2, 3 ఉచిత శిక్షణ

MHBD: మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్-2, 3 పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మహబూబాబాద్ మైనారిటీ సంక్షేమ అధికారి నాగలక్ష్మి తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లో ఈ శిక్షణ ఉంటుందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు నవంబర్ 26లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9182540680, 9059050062 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.