హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు నుంచి పడి యువతి, యువకుడు మృతి

ASF: రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రైలు నుంచి పడి ఓ యువతి, యువకుడు మృతిచెందారు. కేరళం ఎక్స్ప్రెస్‌లో వీరు రైలు నుంచి కిందపడి మరణించారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.