హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రంగనాథస్వామి ఆలయంలో రేపు బంగారు గరుడ సేవ

నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో శనివారం చిలుకు ద్వాదశి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం 7.30కి శ్రీదేవి, భూదేవి సమేత స్వామికి తిరుమంజనం, 8.30కి కౌశిక ద్వాదశి సందర్భంగా కౌశిక పురాణ పఠనం జరుగుతుంది. సాయంత్రం 6.30కి బంగారు గరుడ సేవ, పేట ఉత్సవం, ఉత్తరాది మఠంలో తులసి కళ్యాణం జరుగుతాయి.